మధ్యాహ్న భోజనాన్ని బహిష్కరించిన విద్యార్థులు

మధ్యాహ్న భోజనాన్ని బహిష్కరించిన విద్యార్థులు

టేకులపల్లి, వెలుగు: టేకులపల్లి మండలంలోని బొమ్మనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని బహిష్కరించి ఇంటి నుంచి తెచ్చుకున్న అన్నం తిని నిరసన తెలిపారు. మధ్యాహ్న భోజనం పథకం అమలులో భాగంగా మెనూను పాటించడం లేదని, నాణ్యతగా వండటం లేదని విద్యార్థులు ఆరోపించారు. వంట నిర్వాహకులను మార్చేంత వరకు పాఠశాలలో భోజనం తినేది లేదని విద్యార్థులు స్పష్టం చేశారు.

మంగళవారం బొమ్మనపల్లి ఉన్నత పాఠశాలలో 112 మంది విద్యార్థులకు గాను 35మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 30మంది విద్యార్థులు ఇంటి వద్ద నుంచి బాక్సుల్లో అన్నం తెచ్చుకొని తిన్నారు. మిగత 65 మంది విద్యార్థులకు మాత్రమే పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేశారు.