ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థుల ఆందోళన

ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్శిటీలో పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కానిస్టేబుల్ పరీక్ష ఉన్నందున సెమిస్టర్ పరీక్షను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. సిలబస్ పూర్తి చేయకముందే సెమిస్టర్ పరీక్షలను నిర్వహిస్తున్నారని విద్యార్థులు మండిపడ్డారు.

సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.