అశ్వారావుపేట/దమ్మపేట, వెలుగు: కొత్తగూడెం పట్టణంలోని మెడికల్ కళాశాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో మెడికల్ కళాశాల స్టూడెంట్స్, ప్రొఫెసర్లు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
గత నాలుగేండ్ల కింద కొత్తగూడెంకు మంజూరైన మెడికల్ కళాశాల భవన నిర్మాణం పూర్తి కాకపోవటంతో స్టూడెంట్స్ ఇబ్బందులు పడుతున్నారని ప్రిన్సిపాల్ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో మంత్రి స్టూడెంట్స్ తో మాట్లాడి సమస్య సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
