నాగర్ కర్నూల్ టౌన్/ అచ్చంపేట/వంగూరు, వెలుగు: నాగర్‌కర్నూల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ శనివారం జిల్లావ్యాప్తంగా పలు కార్యక్రమాల్లో పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. తొలత జిల్లా కేంద్రంలో నిర్వహించిన ‘విద్యా వారోత్సవాలు’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా ఉన్నత లక్ష్యాలతో సృజనాత్మక రంగాల్లో రాణించాలని సూచించారు.
అనంతరం అచ్చంపేట మండలం చందాపూర్ మక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ తర్వాత వంగూరు మండలం సర్వారెడ్డిపల్లి తండాకు వచ్చిన కలెక్టర్‌ను కల్వకుర్తి మార్కెట్ వైస్ చైర్మన్ పండిత్ రావు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ పర్యటనల్లో డీఈఓ రమేశ్‌కుమార్, ఆర్డీఓ యాదగిరి పాల్గొన్నారు.
