బ్రిటన్ వర్సిటీలపై కోర్టుకెక్కిన స్టూడెంట్లు

బ్రిటన్ వర్సిటీలపై కోర్టుకెక్కిన స్టూడెంట్లు

న్యూఢిల్లీ:  బ్రిటన్ యూనివర్సిటీలపై స్టూడెంట్లు కోర్టుకెక్కారు. కరోనా టైమ్ లో మేనేజ్ మెంట్లు కాంట్రాక్టులను ఉల్లంఘించినందుకు పరిహారం ఇప్పించాలని లండన్ హైకోర్టులో దావా వేశారు. యూనివర్సిటీ కాలేజ్ లండన్ (యూసీఎల్) సహా 18 యూనివర్సిటీల నుంచి దాదాపు లక్ష మంది స్టూడెంట్లు దానిపై సంతకాలు చేశారు. వీరిలో మన దేశంతో పాటు వివిధ దేశాల స్టూడెంట్లు ఉన్నారు. ‘‘కరోనా టైమ్ లో మాకు కేవలం ఆన్ లైన్ క్లాసులు మాత్రమే చెప్పారు. ల్యాబ్స్, లైబ్రరీలు మొత్తం బంద్ చేశారు. 

కాంట్రాక్ట్ ప్రకారం మాకు ఫిజికల్ క్లాసులు చెప్పాలి. ఆ మేరకు మేం ట్యూషన్ ఫీజులు చెల్లించాం. యూసీఎల్ లో ఒక్కో స్టూడెంట్ ఏటా రూ.10 లక్షల దాకా ఫీజు కట్టారు. కానీ దానికి తగ్గ ప్రతిఫలం దక్కలేదు. ఆన్ లైన్ క్లాసులతో మా చదువు మొక్కుబడిగా సాగింది. సరైన స్కిల్స్ నేర్చుకోలేకపోయాం” అని స్టూడెంట్లు దావాలో పేర్కొన్నారు. 

కోర్టు ఏం చెప్పిందంటే.. 
ఈ పిటిషన్​పై మొదట మే 24న లండన్ హైకోర్టు విచారణ చేపట్టింది. ఆ తర్వాత జులై 17న విచారణ జరిగింది. ఈ సమస్యను కోర్టు బయటే సెటిల్ చేసుకోవాలని కోర్టు ఇరువర్గాలకు సూచించింది. అప్పటి వరకు ట్రయల్​ను నిలిపివేస్తామని చెప్పింది. ఇందుకోసం 8 నెలల టైమ్ ఇచ్చింది. కాగా, తాము కాంట్రాక్టును ఉల్లంఘించలేదని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్​ లండన్ మేనేజ్​మెంట్ అంటోంది. విపత్కర పరిస్థితుల్లో కోర్సులను మార్చే లేదా రద్దు చేసే అధికారం తమకు ఉందని చెబుతోంది.