ఒకేరోజు లాసెట్, యూపీఎస్సీ.. ఆందోళనలో స్టూడెంట్స్‌

ఒకేరోజు లాసెట్, యూపీఎస్సీ.. ఆందోళనలో స్టూడెంట్స్‌

ఎగ్జామ్‌‌ డేట్స్‌ చేంజ్‌ చేస్తామంటున్న అధికారులు

హైదరాబాద్, వెలుగు: హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్ల నిర్లక్యం స్టూడెంట్స్‌కు ఇబ్బందిగా మారింది. వివిధ కోర్సులకు నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్‌‌ల షెడ్యూల్‌‌ను అధికారులు రెండు రోజుల క్రితం ప్రకటించారు. అక్టోబర్‌ 4వ తేదీన లాసెట్‌, పీజీ–లాసెట్‌ ఎగ్జామ్స్‌ నిర్వహిస్తామని తెలిపారు. అయితే, అదే రోజు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌‌ కమిషన్‌ (యూపీఎస్సీ), ఇండియన్‌ ఫారెస్ట్‌‌ సర్వీస్‌‌ ప్రిలిమ్స్‌ ఎగ్జామ్స్‌ ఉన్నాయి. దీంతో స్టూడెంట్స్‌లో ఆందోళన మొదలైంది. ఈ విషయాన్ని లాసెట్‌ కన్వీనర్‌ జీబీ రెడ్డి , ఎస్‌‌ఎఫ్‌‌ఐ లీడర్లు కొందరు తెలియజేశారు. లాసెట్‌ ఎగ్జామ్‌ డేట్‌లో మార్పులు చేయాలని హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ చైర్మన్‌ పాపిరెడ్డికి లెటర్‌ రాశారు. దీనిపై స్పందించిన అధికారులు.. యూపీఎస్సీ షెడ్యూల్‌‌ చెక్‌ చేయలేదని, టీసీఎస్‌‌, టీఎస్‌‌ ఆన్‌లైన్‌ ఆఫీసర్లతో చర్చించి కొత్త డేట్స్‌ వెల్లడిస్తామని చెప్పారు.

For More News..

మీఊర్లో ఎయిర్ పొల్యూషన్ ఎంతుందో తెలుసా?

రాష్ట్రంలో మరో 2,579 కరోనా పాజిటివ్ కేసులు

వరుసగా నాలుగో రోజూ దిగిన బంగారం రేట్లు