నేడు (జులై 12న) విద్యాసంస్థల బంద్

నేడు (జులై 12న) విద్యాసంస్థల బంద్
  • స్టూడెంట్ యూనియన్ల పిలుపు 

హైదరాబాద్, వెలుగు: విద్యా రంగంలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ లెఫ్ట్ విద్యార్థి సంఘాలు (ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్​, పీడీఎస్​యూ, ఏఐఎఫ్ డీఎస్​, ఏఐఎస్​బీ, ఏఐపీఎస్​యూ) బుధవారం విద్యాసంస్థల బంద్​కు పిలుపునిచ్చాయి. విద్యాసంవత్సరం ప్రారంభమై నెలరోజులు కావొస్తున్నా ఇప్పటికీ స్కూళ్లల్లో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్ అందలేదని ఎస్ఎఫ్​ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మూర్తి, నాగరాజు,  ఏఐఎస్ఎఫ్​ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ చెప్పారు. 

ఇంటర్​పుస్తకాల ప్రింటింగ్ కూడా  పూర్తి కాలేదన్నారు. స్కూళ్లల్లో వేలాది టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో  ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. కాగా,  విద్యాసంస్థల బంద్​కు ప్రైవేటు స్కూల్ మేనేజ్మెంట్ల సంఘం(ట్రస్మా) రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్​రావుతో పాటు యువజన సంఘాల నేతలు మద్దతు ప్రకటించారు.