వెల్గటూర్, వెలుగు: ధర్మపురి మండలం లోని ఆరవెల్లి పాఠశాలలో మధ్యాహ్నం పురుగుల అన్నం , నీళ్ళ చారు పెడుతున్నారని సోమవారం విద్యార్థులు ఆందోళన చేశారు. అనంతరం పాఠశాలను విడిచి వెళ్లారు. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం అరవెల్లి హైస్కూల్లో పురుగులు పడిన అన్నం , వెంట్రుకలు తో కూడిన కూరలు, నీళ్ల చారును పెడుతున్నారని అన్నారు.
నాణ్యమైన భోజనం పెట్టేవరకు తాము స్కూల్కు రామని ఆగ్రహించారు. మధ్యాహ్న భోజనం నిర్వహణ పై విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్ధుల తల్లి దండ్రులు డిమాండ్ చేస్తున్నారు.