
హైదరాబాద్, వెలుగు: నారాయణపేట పట్టణానికి చెందిన పూర్వ విద్యార్థులు శనివారం సిటీలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. నారాయణపేటలోని ప్రాథమిక వైదిక పాఠశాల, యూపీఎస్సీ కిల్ గేరి స్కూల్లో 1972-–1982 మధ్య కాలంలో చదువుకున్న స్టూడెంట్లు 47 ఏండ్ల తర్వాత కలుసుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఉన్నత చదువులు, ఉద్యోగ ప్రస్థానం, కుటుంబ విషయాలను ఈ సమ్మేళనంలో పంచుకున్నారు.
వీరిలో బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ మహేశ్ కుమార్, సీనియర్ జర్నలిస్టు బాలకిషన్ రావు, కేంద్రీయ విద్యాలయంలో పీజీటీగా పని చేస్తున్న రాఘవేంద్ర గుప్తా, ప్రభుత్వ టీచర్లు శశికళ, శంకరమ్మ, రేవతి, నాగలక్ష్మి, విద్యాసంస్థ నిర్వహిస్తున్న డీవీవీ ప్రసాద్ రెడ్డి, ఆర్టీసీలో పనిచేస్తున్న సునీత ఉన్నారు. సీసీఐ మార్కెటింగ్ అధికారి పి వెంకట్ రాములు, సహకార శాఖ అధికారి నాగార్జున, వ్యాపారవేత్తలు లకంసీ పటేల్, హనుమంతరావు, గోవిందరావు, రవీందర్, చంద్రకాంత్ , సీతా రాములు తమ అనుభవాలను పంచుకున్నారు. ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలను తరచుగా నిర్వహించుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.