వార్దాలో తక్కువ.. వైన్‌‌‌‌గంగలో ఎక్కువ! వైన్‌‌‌‌గంగ నుంచి వార్దాలోకి నీటిని మళ్లించేలా చానెల్ నిర్మాణంపై స్టడీ...

వార్దాలో తక్కువ.. వైన్‌‌‌‌గంగలో ఎక్కువ!  వైన్‌‌‌‌గంగ నుంచి వార్దాలోకి నీటిని మళ్లించేలా చానెల్ నిర్మాణంపై స్టడీ...
  • వార్దా వైపు 30 టీఎంసీలు.. వైన్‌‌‌‌ గంగవైపు నుంచి 130 టీఎంసీల దాకా వాడుకునే వీలు
  • పీఎఫ్‌‌‌‌ఆర్​లో హైడ్రాలజీ సహా 7 చాప్టర్లు రెడీ
  • బోర్‌‌‌‌‌‌‌‌హోల్స్​ డేటా ఆలస్యం.. మరో 20 రోజుల్లో ప్రభుత్వానికి పీఎఫ్ఆర్​
  • మీటింగ్‌‌‌‌ పై ఇప్పటికీ మహారాష్ట్ర నుంచి నో రెస్పాన్స్​

హైదరాబాద్, వెలుగు: తుమ్మిడిహెట్టి ప్రాజెక్టులపై అధికారులు శరవేగంగా పనులు చేస్తున్నారు. వీలైనంత త్వరగా ఆ ప్రాజెక్టు ఫీజిబిలిటీ రిపోర్టు (పీఎఫ్‌‌‌‌ఆర్)ను ప్రభుత్వానికి సమర్పించేలా డెడ్​లైన్స్ పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. 8 చాప్టర్లుగా సిద్ధం చేస్తున్న పీఎఫ్​ఆర్ దాదాపుగా సిద్ధమైందని తెలుస్తున్నది. అత్యంత కీలకమైన హైడ్రాలజీ రిపోర్టు సహా 7 చాప్టర్లు ఇప్పటికే పూర్తయ్యాయని చెబుతున్నారు. ప్రాజెక్టును వైన్‌‌‌‌గంగపై ఒకటి, వార్దాపై మరొకటి.. రెండు బ్యారేజీలుగా నిర్మించి వాటిని కనెక్ట్​ చేసేలా కాంక్రీట్​బండ్​ నిర్మాణం చేపట్టనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ రెండు బ్యారేజీలకు సంబంధించి నీటి లభ్యతపై క్లారిటీ వచ్చినట్టు తెలిసింది.

వార్దాతో పోలిస్తే వైన్‌‌గంగ వైపు నీటి లభ్యత ఎక్కువగా ఉన్నట్టు తేలిందని సమాచారం. వైన్‌‌గంగ వైపు నుంచి 130 టీఎంసీలు తీసుకునేందుకు వీలుంటే.. వార్దా వైపు నుంచి కేవలం 30 టీఎంసీల జలాలనే వాడుకునే వెసులుబాటు ఉన్నట్టు స్టడీల్లో తేలిందని తెలిసింది. ప్రాజెక్ట్​ కాలువ నెట్​వర్క్ అంతా వార్దా వైపు నుంచే నిర్మిస్తుండడంతో.. వైన్‌‌గంగ వైపు నుంచి నీటిని ఎలా తీసుకెళ్లాలన్న దానిపై అధికారులు స్టడీ చేసినట్టు తెలుస్తున్నది. 

ఇప్పటికే సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో) అధికారులు కూడా.. వైన్‌‌గంగ వైపు నుంచి నీటిని వార్దాలోకి తీసుకొచ్చేలా డిజైన్స్​ ప్లాన్స్​ రెడీ చేస్తున్నట్టు సమాచారం. వైన్‌‌గంగ నీళ్లను వార్దాలోకి తీసుకొచ్చేందుకు కాంక్రీట్​ బండ్​ నుంచి మధ్యలో ఓ కెనాల్​ చానెల్​ను నిర్మించే యోచనలో ఉన్నట్టు తెలిసింది. తద్వారా వైన్‌‌గంగ వద్ద అందుబాటులో ఉన్న నీళ్లను వార్దాలోకి మళ్లించడం ద్వారా పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.

మరో 20 రోజుల్లో పీఎఫ్‌‌ఆర్..

ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై తయారు చేసే ప్రాజెక్ట్​ ఫీజిబిలిటీ రిపోర్టు (పీఎఫ్‌‌ఆర్) దాదాపు రెడీ అయిపోయిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరో 15 నుంచి 20 రోజుల్లో పీఎఫ్‌‌ఆర్ పూర్తిగా సిద్ధమవుతుందని అంటున్నారు. ఇంటర్​స్టేట్ అంశాలు, హైడ్రాలజీ, ప్రాజెక్ట్ వివరాలు, డిజైన్స్ సహా 7 అంశాలను ఇప్పటికే పీఎఫ్‌‌ఆర్‌‌‌‌లో పొందుపరిచినట్టు తెలిసింది. అయితే, ప్రాజెక్టుకు అత్యంత కీలకమైన టెక్నికల్ ఎవాల్యుయేషన్ వివరాలు ఇంకా పూర్తి కాలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. నిర్మాణ ప్రాంతంలో ప్రాజెక్టు సాధ్యమేనా అని తెలుసుకునేందుకు నిర్వహించే జియోటెక్నికల్, జియో ఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్ ప్రస్తుతం కొనసాగుతున్నాయంటున్నారు. 

బోర్‌‌‌‌హోల్స్ తవ్వకం పూర్తయి టెస్టులను చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఆ టెస్టుల రిపోర్టులు రావడానికి మరో పది రోజులు లేదా రెండు వారాల సమయం పట్టే అవకాశం ఉందని వివరిస్తున్నారు. అవన్నీ వచ్చి పీఎఫ్‌‌ఆర్‌‌‌‌లో చేర్చేందుకు ఆ తర్వాత మరో రెండు మూడు రోజులు పడుతుందంటున్నారు. దీంతో రిపోర్టును అటూఇటుగా 20 రోజుల్లో ప్రభుత్వానికి సమర్పించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. వాస్తవానికి ఈ నెల తొలివారానికే సిద్ధమవుతుందని భావించినా.. బోర్‌‌‌‌హోల్స్ డేటా వల్లే ఆలస్యమైందంటున్నారు. 

మహారాష్ట్ర చప్పుడు లేదు..

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఇంటర్‌‌‌‌స్టేట్ అంశం కావడంతో.. మహారాష్ట్ర నుంచి సమ్మతమే ఇప్పుడు మిగిలి ఉంది. ప్రాజెక్టును 148 మీటర్ల ఎత్తుతో నిర్మించేందుకు గతంలో ఒప్పందం కుదిరినా.. ఇప్పుడు నీటి లభ్యత, వినియోగం విషయంలో ఎత్తును సవరించాల్సి ఉన్నది. కనీసం 150 మీటర్ల ఎత్తుతోనైనా నిర్మించి.. 80 టీఎంసీలు వాడుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ క్రమంలోనే మహారాష్ట్రతో చర్చలు జరపాలని నిర్ణయించి.. సీఎం రేవంత్, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్.. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌‌కు లేఖలు రాశారు. లేఖలు రాసి నెల రోజులు దాటుతున్నా అటువైపు నుంచి ఎటువంటి సమాధానం రావడం లేదు. 

సామరస్యపూర్వక చర్చలకూ ఒప్పుకునేందుకు మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం సుముఖంగా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటు రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు కూడా ఆ దిశగా చొరవ తీసుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్‌‌రెడ్డి, బండి సంజయ్ కీలక స్థానాల్లో ఉన్నా కూడా.. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మీటింగ్‌‌కు ఏర్పాట్లు చేయించకపోవడం ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మీటింగ్‌‌కు మహారాష్ట్రను ఒప్పించేలా బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు చొరవ తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.