జర్నలిస్టుల ఇండ్ల స్థలాలపై స్టడీ చేస్తున్నం : ​ శ్రీనివాస్​రెడ్డి

జర్నలిస్టుల ఇండ్ల స్థలాలపై స్టడీ చేస్తున్నం :  ​ శ్రీనివాస్​రెడ్డి

బషీర్ బాగ్, వెలుగు :  జర్నలిస్టుల ఇండ్ల స్థలాలపై స్టడీ చేస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇచ్చేందుకు కృషి చేస్తామని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్​రెడ్డి తెలిపారు. సోమవారం హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్ యూజే- టీడబ్ల్యూజేఎఫ్)​ టీమ్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించింది. అనంతరం హెచ్​యూజే నూతన డైరీని అందించింది.  జర్నలిస్టుల ఇండ్ల స్థలాల అంశంపై హెచ్​యూజే బృందంతో చైర్మన్ చర్చించారు. జేఎన్​జే ఇష్యూను పరిష్కరిస్తూనే.. ఇతర సొసైటీల్లోని జర్నలిస్టులకు ఏ ప్రాతిపదికన ఇవ్వాలనే దానిపైనా కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. 

సిటీలో పనిచేసే వర్కింగ్​జర్నలిస్టులందరికీ ఒకేచోట ఇవ్వడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదని, నగరానికి నలువైపులా స్థలాలు కేటాయించే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీనిపై పార్లమెంట్​ఎన్నికల తర్వాత మరింత ప్రోగ్రెసివ్​గా ముందుకెళ్లనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. డిజిటల్​మీడియాలో పని చేసేవారి విషయంలో ఎలాంటి ప్రాతిపదికతో ముందుకు వెళ్లాలనే దానిపైన కూడా ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. మీడియా అకాడమీ చైర్మన్ ను కలిసిన వారిలో హెచ్​యూజే అధ్యక్ష, కార్యదర్శులు అరుణ్​ కుమార్, జగదీశ్వర్, వర్కింగ్​ ప్రెసిడెంట్ గండ్ర​నవీన్​, కోశాధికారి రాజశేఖర్​, వైస్​ ప్రెసిడెంట్​రమేశ్, ఈసీ మెంబర్​సుభాశ్ ఉన్నారు.