కన్నడ కామెడీ దెయ్యం తెలుగులోకి

కన్నడ కామెడీ దెయ్యం తెలుగులోకి

కన్నడలో చిన్న చిత్రంగా విడుదలైన ‘సు ఫ్రం సో’ అనే సినిమా సూపర్ సక్సెస్‌‌‌‌‌‌‌‌ను అందుకుని తెలుగులోకి వస్తోంది. ఆగస్టు 8న మైత్రి మూవీ మేకర్స్‌‌‌‌‌‌‌‌ సంస్థ తెలుగులో విడుదల చేస్తోంది. జెపీ తుమినాడ్ దర్శకత్వం వహించాడు.  మంగళవారం తెలుగు ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. ఓ చిన్న గ్రామంలో ఆవారాగా తిరిగే అశోక్‌‌‌‌‌‌‌‌ అనే కుర్రాడిని సోమేశ్వర నుంచి వచ్చిన సులోచన అనే దెయ్యం ఆవహించిందని పుకార్లు వ్యాపిస్తాయి.  

ఆ తర్వాత ఆ ఊర్లో కొన్ని ఊహించని సంఘటనలు జరగడం, జనంలో ఏర్పడిన గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో రూరల్ కామెడీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తెరకెక్కించారు. గ్రామాల్లో సహజంగా ఉండే మూఢ నమ్మకాలు, జానపద కథల మేళవింపుతో దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. 

శనీల్ గౌతమ్ లీడ్‌‌‌‌‌‌‌‌ రోల్‌‌‌‌‌‌‌‌లో నటించగా శాంధ్య ఆరకెరె, ప్రకాశ్ తుమినాడ్ ఇతర పాత్రలు పోషించారు.  దర్శకుడు కీలకపాత్ర పోషించాడు. అలాగే ప్రముఖ కన్నడ దర్శకనిర్మాత రాజ్‌‌‌‌‌‌‌‌ బి శెట్టి సహనిర్మాతగా వ్యవహరించడంతో పాటు అతిథి పాత్ర పోషించాడు.