ఎంపీడీ వో ఆఫీస్ లో హెల్ప్ డెస్క్ ప్రారంభించిన సబ్ కలెక్టర్ అజయ్ కుమార్ యాదవ్

ఎంపీడీ వో ఆఫీస్ లో  హెల్ప్ డెస్క్ ప్రారంభించిన సబ్ కలెక్టర్ అజయ్ కుమార్ యాదవ్

సత్తుపల్లి, వెలుగు : కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ కుమార్ యాదవ్ సోమవారం సత్తుపల్లి ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ ఎన్నికల హెల్ప్ డెస్క్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో ఆర్ చిన్న నాగేశ్వర రావు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్ల గురించి సబ్ కలెక్టర్ కు వివరించారు.

 కిష్టారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉన్న నామినేషన్ల కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రమణ, సిబ్బంది పాల్గొన్నారు.