మహారాష్ట్రకు సబ్సిడీ ఎరువులు ..అక్రమంగా తరలిస్తున్న యూరియాను పట్టుకున్న ఆదిలాబాద్ పోలీసులు

మహారాష్ట్రకు సబ్సిడీ ఎరువులు ..అక్రమంగా తరలిస్తున్న యూరియాను పట్టుకున్న ఆదిలాబాద్ పోలీసులు

ఆదిలాబాద్, వెలుగు: ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న ఎరువులను అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్న వాహనాలను మంగళవారం ఆదిలాబాద్​ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఆదిలాబాద్  డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభుత్వరంగ సంస్థ హాకాలో పని చేస్తున్న ప్రొప్రైటర్  సునీల్, ఉద్యోగి అజయ్ మహారాష్ట్రలోని మాతార్జున్​ గ్రామంలోని ఫర్టిలైజర్  షాప్ ఓనర్​ నిఖిల్ తో కుమ్మక్కై యూరియాను తరలించేందుకు ప్లాన్​ చేశారు. 

మంగళవారం బేల మండలకేంద్రంలోని హాకా సెంటర్​ నుంచి రూ.3 లక్షల విలువ చేసే 150 బ్యాగుల యూరియాను వాహనాల్లో తరలిస్తుండగా, ఈ విషయాన్ని రైతులు పోలీసులకు తెలియజేశారు. వెంటనే స్పందించిన జైనథ్​ సీఐ డి సాయినాథ్, బేల ఎస్సై నాగ్​నాథ్​ సిబ్బందితో కలిసి దాడి చేసి యూరియాను స్వాధీనం చేసుకున్నారు. హాకా సెంటర్​ నిర్వాహకులు సునీల్, అజయ్, మహారాష్ట్రకు చెందిన ఫర్టిలైజర్​ షాప్​ ఓనర్​ నిఖిల్, వాహనాల డ్రైవర్లు వాకంటే దిలీప్, చలికలవార్​ చంద్రశేఖర్​పై కేసు నమోదు చేశారు. యూరియాను పట్టుకున్న సీఐ, ఎస్సైలను డీఎస్పీ అభినందించారు.