ప్లాన్ ప్రకారం చదివితే సక్సెస్ సాధ్యం : కలెక్టర్ జితేశ్ వి పాటిల్

ప్లాన్ ప్రకారం చదివితే సక్సెస్ సాధ్యం : కలెక్టర్ జితేశ్ వి పాటిల్

 

కామారెడ్డిటౌన్, వెలుగు : సానుకూల దృక్పథంతోనే లక్ష్యాన్ని చేరుకోగలమని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తెలిపారు.  గ్రూప్​-1,2, 3 తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఎస్సీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో కామారెడ్డి ప్రభుత్వ  డిగ్రీ కాలేజీలో ఉచిత శిక్షణ ఇస్తున్నారు . శనివారం అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ ను కలెక్టర్ అందజేశారు. సిలబస్​ను అర్థం చేసుకొని చదవాలని సూచించారు.

భయం వీడి చక్కటి ప్రణాళికతో  రెడీ అయితే తప్పకుండా విజయం సాధించవచ్చన్నారు.  సొంత నోట్స్ తయారు  చేసుకోవడంతోపాటు కరెంట్​అఫైర్స్​పై ఎక్కువగా దృష్టి పెట్టాలని చెప్పారు. కార్యక్రమంలో ఎస్సీ వెల్ఫేర్​జిల్లా ఆఫీసర్​ రజిత,  కాలేజీ ప్రిన్సిపాల్​విజయ్​కుమార్, టీఎన్జీవో జిల్లా ప్రెసిడెంట్​ వెంకట్​​రెడ్డి తదితరులు  పాల్గొన్నారు.