కరీంనగర్ జిల్లా క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి : సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

కరీంనగర్ జిల్లా క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి : సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
  • ఖోఖో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి 

కరీంనగర్, వెలుగు : జిల్లా క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని కరీంనగర్ ఖోఖో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉమ్మడి జిల్లా స్థాయి సీనియర్ గర్ల్స్,  బాయ్స్  ఖోఖో జట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై నరేందర్​రెడ్డి ఖోఖో పోటీలను ప్రారంభించారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడలతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. గతంలో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటి జిల్లా క్రీడా పతాకాన్ని అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించారని గుర్తుచేశారు. మున్ముందు జిల్లా క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని సూచించారు. ఈ పోటీల్లో కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల నుంచి 225 మంది క్రీడాకారులు హాజరయ్యారు. 

ఇందులో రాష్ట్రస్థాయిలో పాల్గొనే శిక్షణ శిబిరానికి 20 మంది బాలికలు, 20 మంది బాలురను ఎంపిక చేశారు. కార్యక్రమంలో డీవైఎస్ వో వి.శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఎస్జీఎఫ్ ప్రధాన కార్యదర్శి భాషబోయిన వేణుగోపాల్, ఖోఖో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మహేందర్ రావు,  సంఘం ఉపాధ్యక్షుడు, కరీంనగర్ ట్రాఫిక్ సీఐ కుమారస్వామి, కోశాధికారి చిట్టి తిరుపతిరెడ్డి, జగిత్యాల జిల్లా  సంఘం ప్రతినిధి డాక్టర్ రవీందర్, సిరిసిల్ల జిల్లా సంఘం ప్రతినిధి ఎస్కే మోహినొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.