- సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కరీంనగర్ సిటీ, వెలుగు: పదేళ్లు బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని ఊదరగొట్టి ఒక్క ఇల్లు కూడా కట్టించలేదని, ఆనాడైనా, ఈనాడైనా ఇండ్లు నిర్మించి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి అన్నారు.
శుక్రవారం కరీంనగర్ హుస్సేనీపురలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. కార్యక్రమంలో డివిజన్ బాధ్యులు షబానా మహమ్మద్, సమద్ నవాబ్, హనీఫ్, మీరజ్, మసుమ్, ఖలీల్, బషీర్, జాఫర్, కవిత, తిరుమల, లత పాల్గొన్నారు.
