రాజ్యసభ ఎంపీగా సుధామూర్తి ప్రమాణస్వీకారం

రాజ్యసభ ఎంపీగా సుధామూర్తి ప్రమాణస్వీకారం

ఇన్‌ఫోసిస్‌ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తి భార్య సుధా మూర్తి ఆరోజు (మార్చి 14)న రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మెన్‌ జగదీప్‌ ధన్‌కర్‌ తన ఛాంబర్‌ లో ఆమె చేత ప్రమాణం చేయించారు. లీడర్‌ ఆఫ్‌ ద హౌజ్‌ పీయూష్‌ గోయల్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుధా మూర్తి వయసు 73 ఏళ్లు, ఆమె అనేక పుస్తకాలు రాశారు. ఇన్‌ ఫోసిస్‌లో మాజీ చైర్మెన్‌ గా పనిచేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గత శుక్రవారం రాజ్యసభకు సుధామూర్తిని నామినేట్‌ చేశారు. 

కన్నడ, ఆంగ్ల సాహిత్యంలో అనేక రచనలు చేశారు. సాహిత్య అకాడమీ బాల్‌ సాహిత్య పురస్కార్‌ అందుకున్నారు. 2006లో ఆమెకు పద్మశ్రీ అందజేశారు. 2023లో పద్మభూషణ్‌ పురస్కారాన్ని అందుకున్నారు. టెల్కో కంపెనీలో పనిచేసిన తొలి మహిళా ఇంజినీర్‌ గా సుధామూర్తికి గుర్తింపు ఉన్నది. ఇన్‌ ఫోసిస్‌ మొదలుపెట్టేందుకు తన ఎమర్జెన్సీ ఫండ్‌ నుంచి ఆమె పదివేలు తీసి భర్తకు ఇచ్చారు. ఇప్పుడు ఆ కంపెనీ విలువ సుమారు 80 బిలియన్ల డాలర్లు. సుధా మూర్తి కుమార్తె అక్షత బ్రిటీష్‌ ప్రధాని రిషి సునాక్‌ను వివాహం చేసుకున్నారు.