
సుడిగాలి సుధీర్ హీరోగా ‘పాగల్’ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘గోట్’. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ అనేది ట్యాగ్‌లైన్. దివ్య భారతి హీరోయిన్. చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మిస్తున్నారు. సోమవారం ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు. సుధీర్ ఒక చేత్తో క్రికెట్ బ్యాట్ పట్టుకుని, మరో చేత్తో సిగరెట్ కాల్చుతూ మాస్ రగ్డ్ లుక్‌లో కనిపిస్తున్నాడు.
‘ఎవడ్రా నన్ను ప్లూక్ అన్నది’ అంటూ సుధీర్ చెప్పిన డైలాగ్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. లియోన్ జేమ్స్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా ఉంది. మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు, ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌తో పాటు రెండు పాటల షూటింగ్ పూర్తయిందని దర్శక నిర్మాతలు తెలియజేశారు.