Harom Hara Movie Review: హరోం హర సినిమా రివ్యూ.. యాక్షన్ తో అదరగొట్టేసిన సుధీర్ బాబు

Harom Hara Movie Review: హరోం హర సినిమా రివ్యూ.. యాక్షన్ తో అదరగొట్టేసిన సుధీర్ బాబు

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ హరోం హర. కొత్త దర్శకుడు జ్ఞాన సాగర్ ద్వారక తెరకెక్కించిన ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటించారు. సునీల్, జయప్రకాష్ కీ రోల్స్ చేసిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందుకే ఈ సినిమా కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. ఎట్టకేలకు ఈ సినిమా నేడు(జూన్ 14) థియేటర్స్ లోకి వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది? సుధీర్ బాబు ఈ సినిమాతో ఆడియన్స్ ను మెప్పించాడా? అనేది ఈ రివ్యూలో చూద్దాం.

కథ:
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు మూడు సరిహద్దులు కలిసే ప్రాంతం కుప్పం. ఆ ఊరును తిమ్మారెడ్డి అతని సోదరులు తమ గుప్పెట్లో పెట్టుకుంటారు. అదే సమయంలో కుప్పం పాలిటెక్నిక్ కాలేజీలో ఆ ఊరికి వస్తాడు సుబ్రహ్మణ్యం(సుధీర్ బాబు). అనుకోకుండా ఒకవ్యక్తితో గొడవ జరిగి కాలేజీ నుంచి సస్పెండ్ అవుతాడు. ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడటానికి తన స్నేహితుడైన పళని స్వామి(సునీల్)తో కలిసి గన్ తయారీ మొదలు పెడతాడు. అలా గన్ తయారీ మొదలుపెట్టిన సుబ్రహ్మణ్యం.. జీవితం తరువాత ఎలాంటి మలుపులు తిరిగింది? ఉద్యోగం పోవడానికి కారణమైన వ్యక్తితో సుబ్రహ్మణ్యం ఎందుకు చేతులు కలిపాడు? సుబ్రహ్మణ్యం ఆ ఊరికి  దేవుడు ఎలా అయ్యాడు? అనేది మిగిలిన కథ?

విశ్లేషణ:
బతకడానికి వేరే ఊరినుండి వచ్చే హీరో. అక్కడ లోకల్ రౌడీలతో గొడవ. వారిని అంతం చేసి ఆ ఊరికి హీరో దేవుడవడం అనే కాన్సెప్ట్ తో ఇప్పటివరకు చాలా సినిమాలే వచ్చాయి. హరోం హర సినిమా కథ కూడా అదే. కానీ, ప్రెజెంటేషన్ కొత్తగా డీల్ చేశారు దర్శకుడు. అదే ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది అని చెప్పాలి. మధ్యలో వచ్చే అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్, నెక్స్ట్ లెవల్ బీజీఎమ్ ఆడియన్స్ కి మంచి హై ఇవ్వడం ఖాయం. అవే ఈ సినిమాను ప్రత్యేకంగా నిలిపాయి. 

నిజానికి ఇంటర్వెల్ యాక్షన్ బ్లాక్ వచ్చే అంతవరకు పెద్దగా సినిమాలో చెప్పుకోవడానికి ఎం ఉండదు. కానీ, ఆ యాక్షన్ సీన్ తరువాత సినిమా మూడ్ మొత్తం మారిపోతుంది. సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెరుగుతుంది. ఇక అక్కడి నుండి కథలో వేగం పెరుగుతుంది. ఎమోషన్స్ విషయాల్లో కాస్త కనెక్షన్ మిస్ అయినా.. యాక్షన్ సీక్వెన్స్, వైలెన్స్ మాత్రం యాక్షన్ లవర్స్ కి విపరీతంగా నచ్చేస్తాయి. మొత్తంగా ఒక మంచి యాక్షన్ డ్రామా చూసిన ఫీలింగ్ కలుగుతుంది.

నటీనటులు, సాంకేతికనిపుణులు:
హరోం హర సినిమాకు మెయిన్ హైలెట్ సుధీర్ బాబు. తన సెట్టిల్డ్ నటనతో ఆకట్టుకున్నాడు ఆయన. సినిమా కోసం ఆయన పడ్డ కష్టం ప్రతీ ఫ్రేమ్ లో కనిపిస్తుంది. హీరోయిన్ మాళవిక శర్మ కూడా పాత్రకు తగ్గట్టుగా ఆకట్టుకున్నారు. నటుడు సునీల్ కి చాలా కాలం తర్వాత ఫుల్ లెంత్ రోల్ పడింది. తనదైన స్టైల్లో ఆకట్టుకున్నారు. ఇక మిగతా పాత్రల్లో జయప్రకాశ్ సహా, రవి కాలే, అర్జున్ గౌడ వంటి వాళ్లు తమ తమ పాత్రల్లో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. 

ఇక సాంకేతికనిపుణులు విషయానికి వస్తే.. హరోం హర సినిమాకు మెయిన్ హీరో అంటే చేతన్ భరద్వాజ్ అనే చెప్పాలి. తన బీజీఎమ్ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాడు. మరీ ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లో వచ్చే మ్యూజిక్ మాత్రం అద్భుతం. చేతన్ భరద్వాజ్ కు ఇది కెరీర్ బెస్ట్ అనే చెప్పొచ్చు. తన మ్యూజిక్ తో సినిమాకు ప్రాణం పెట్టేశాడు. ఇక సినిమాటోగ్రఫీతో గురించి స్పెషల్ గా మాట్లాడుకోవాలి  1980 లనాటి కుప్పాన్ని అద్భుతంగా తెరపై చూపించారు. ఇక ఆనాటి కాలాన్ని రీ క్రియేట్ చేసిన ఆర్ట్ టీం కష్టం కూడా ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. 
 
ఇక హరోం హర సినిమా గురించి ఒక్కముక్కలో చెప్పాలంటే.. హరోం హర అద్భుతమైన యాక్షన్ సినిమా చూసిన ఫీలింగ్ ఇవ్వడం మాత్రం గ్యారంటీ.