
సుధీర్ బాబు హీరోగా ‘హరోం హర’. సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నాడు. సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. సుధీర్ బాబు, సునీల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌లు, ది ఫస్ట్ ట్రిగ్గర్ అనే గ్లింప్స్ విడుదల చేసిన మేకర్స్.. తాజాగా హీరోయిన్ మాళవిక శర్మ పాత్రను పరిచయం చేశారు. ఇందులో దేవి అనే పాత్రను పోషిస్తున్న ఆమె.. సుబ్రహ్మణ్య స్వామి ముందు నిలబడి చీరకట్టులో చిరునవ్వుతో కనిపిస్తోంది.
1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. సుధీర్ బాబు కెరీర్‌లో హై బడ్జెట్ మూవీ ఇదని చెబుతున్నారు మేకర్స్. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.