
పోయినేడు ‘శ్రీదేవి సోడా సెంటర్’తో మెప్పించిన సుధీర్ బాబు ఈయేడు కనీసం రెండు సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. వీలైనంత ఫాస్ట్‌గా వర్క్ పూర్తి చేసేస్తున్నాడు. ఇటీవలే యాక్టర్ కమ్ రైటర్ హర్షవర్థన్ డైరెక్షన్లో ఓ సినిమా స్టార్ట్ చేశాడు సుధీర్. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మొదటి షెడ్యూల్‌ని కూడా కంప్లీట్ చేసేశాడు. ఇది తనకి పదిహేనోవ సినిమా. ఒక డిఫరెంట్ గెటప్‌లో కనిపించనున్నాడు. హీరోయిన్ని ఇంకా రివీల్ చేయలేదు. టైటిల్ కూడా ఫిక్సవ్వలేదు. నారాయణ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. మరోవైపు మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే మూవీలో కూడా నటిస్తున్నాడు సుధీర్. ఈ మూవీ పనులు కూడా జెట్ స్పీడులో జరుగుతున్నాయి. ఆల్రెడీ షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. తన పార్ట్ డబ్బింగ్ వర్క్‌ని నిన్నటితో కంప్లీట్ చేశాడు సుధీర్. త్వరలోనే టీజర్ రిలీజ్ చేస్తామని కూడా అనౌన్స్ చేశాడు.