సుడిగాలి సుధీర్ హీరోగా సుధీర్ జోకర్ మూవీ 

సుడిగాలి సుధీర్ హీరోగా సుధీర్ జోకర్ మూవీ 

సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రానికి   ‘సుధీర్ జోకర్’ అనే టైటిల్‌‌‌‌ను ప్రకటించారు. పీఎస్ సునీల్ పుప్పాల దర్శకత్వం వహిస్తున్న ఈ  చిత్రాన్ని   విజయ్ డొంకాడ,  శ్రీధర్ మక్కువ కలిసి నిర్మిస్తున్నారు. మంగళవారం సుధీర్ పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందే ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేయడంతోపాటు ఫస్ట్ లుక్‌‌‌‌ను  రిలీజ్ చేశారు మేకర్స్.  ఈ  పోస్టర్‌‌‌‌లో ప్లేయింగ్ కార్డ్స్ మధ్య స్టైలిష్ లుక్‌‌‌‌లో కనిపించిన సుధీర్ లుక్ ఆకట్టుకుంది.  

ఈ సినిమాతో అయేషా హీరోయిన్‌‌‌‌గా  పరిచయం అవుతుండగా,  అభిరామి, మురళీ శర్మ, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, విష్ణు ఓయ్, మురళీధర్ గౌడ్ ఇతర  పాత్రల్లో నటిస్తున్నారు.  ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తుండగా, అహ్మద్ షెరీఫ్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. 

ధర్మేంద్ర కాకర్ల ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టగా, విఠల్ కోసనం ప్రొడక్షన్ డిజైనర్‌‌‌‌గా పనిచేస్తున్నారు. కాస్ట్యూమ్ డిజైనర్‌‌‌‌గా చిన్మయి కకిలేటి వ్యవహరిస్తున్నారు.  పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు దర్శక నిర్మాతలు తెలియజేశారు.