
డిఫరెంట్ స్ర్కిప్టులు సెలెక్ట్ చేసుకుంటూ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తున్నాడు సుధీర్ బాబు. ఆల్రెడీ మామా మశ్చీంద్ర, హరోం హర సినిమాలతో బిజీగా ఉన్న సుధీర్ నుంచి మరో క్రేజీ అనౌన్స్‌మెంట్ వచ్చింది. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో సునీల్ బలుసు కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆదివారం ఈ మూవీ టైటిల్‌ను ప్రకటించారు. ‘మా నాన్న సూపర్ హీరో’ టైటిల్‌తో దీన్ని రూపొంది స్తున్నారు. తండ్రి, కొడుకుల మధ్య ఉండే ప్రేమ, అనుబంధాన్ని తెలియజేసేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు దర్శక నిర్మాతలు చెప్పారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. సుధీర్ బాబుకి జోడీగా ఆర్నా హీరోయిన్‌గా నటిస్తోంది. సాయి చంద్, షియాజి షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, హర్షిత్ రెడ్డి సపోర్టింగ్ రోల్స్ పోషిస్తున్నారు. జై క్రిష్ సంగీతం అందిస్తున్నాడు.