సుడిగాలి సుధీర్ హైలెస్సో ఫస్ట్ లుక్

సుడిగాలి సుధీర్ హైలెస్సో ఫస్ట్ లుక్

సుడిగాలి సుధీర్ హీరోగా ప్రసన్న కుమార్ కోట దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హైలెస్సో’. వజ్ర వారాహి సినిమాస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై శివ చెర్రీ, రవికిరణ్ నిర్మిస్తున్నారు. హీరోగా సుధీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇది ఐదో చిత్రం. 

ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమాకు సంబంధించి దసరా సందర్భంగా సుధీర్ ఫస్ట్ లుక్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. ఇంటెన్స్ అండ్ డివైన్ వైబ్‌‌‌‌‌‌‌‌తో ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంది. విలేజ్ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నటాషా సింగ్, నక్ష శరణ్‌‌‌‌‌‌‌‌ హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్నారు. శివాజీ, కన్నడ నటి అక్షర గౌడ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మొట్ట రాజేంద్రన్, గెటప్ శ్రీను, బెవర దుహిత శరణ్య ఇతర పాత్రలు పోషిస్తున్నారు. అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.