బోధన్, వెలుగు: జిల్లాలోని ప్రజల అవసరాలకు సరిపడా సమృద్ధిగా తాగునీరు సరఫరా చేయాలని నిజామాబాద్కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. బోధన్‌లోని సబ్ కలెక్టర్ ఆఫీస్‌లో గ్రామీణ నీటి సరఫరా అధికారులతో రివ్యూ నిర్వహించారు. వేసవిలో జిల్లాలో ఎక్కడా కూడా నీటి సమస్య తలెత్తకుండా పకడ్బందీ పర్యవేక్షణ చేపట్టాలన్నారు. లీకేజీలు ఉన్నచోట, చేతి పంపులు, బోరు బావులకు అవసరమైన చోట వెంటనే రిపేర్లు చేయాలన్నారు.
అనంతరం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం స్థలాన్ని పరిశీలించారు. త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు కలెక్టర్‌తెలిపారు. సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఆర్ డబ్ల్యూ ఎస్ఎస్ఈ రాజేందర్, డీపీవో శ్రీనివాస్ రావు, జడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయన్న, మిషన్ భగీరథ ఈఈలు రాకేశ్, స్వప్న, డీఎల్పీఓలు, ఎంపీడీఓలు, ఏఈలు, ఎంపీవోలు పాల్గొన్నారు.

