
సుహాస్, మాళవిక మనోజ్ ప్రధానపాత్రల్లో నటించిన రీసెంట్ మూవీ 'ఓ భామ.. అయ్యోరామ'. జులై 11న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా కామెడీ ప్రియులను ఆకట్టుకుంది. ఇప్పుడీ మూవీ ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు 20 రోజుల్లోనే ఓటీటీలోకి అడుగుపెట్టింది.
ఇవాళ (ఆగస్టు1) నుంచి తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని తెలుపుతూ సదరు ఓటీటీ సంస్థ ఓ పోస్టర్ను షేర్ చేసింది. “అతడు కోల్పోయిన కలలను ఆమె తిరిగి తీసుకొచ్చింది.. అంతేకాదు అతని లోతైన గాయాలను కూడా.. ఓ భామ అయ్యో రామ ఆగస్ట్ 1న ప్రీమియర్ కానుంది. ఈటీవీ విన్ లో..” అనే క్యాప్షన్తో ట్వీట్ చేసింది. ఈ ప్రేమకథ చిత్రానికి రామ్ గోదాల దర్శకత్వం వహించగా.. వీ ఆర్ట్స్ బ్యానర్పై హరీష్ నల్లా నిర్మించారు.
ఈ చిత్రంలో రవీందర్ విజయ్.. బబ్లూ పృథ్వీ రాజ్, ప్రభాస్ శ్రీను, రఘు కారుమంచి, సాత్విక్ ఆసంద్, నయని పావని కీలక పాత్రలో కనిపించారు. ఈ విభిన్నమైన రొమాంటిక్ లవ్ స్టోరీ థియేటర్లోకి వచ్చి ప్రేక్షకులను అలరించింది. కానీ బాక్సాఫీసు వద్ద మాత్రం హిట్ అందుకోలేకపోయింది.
Watch #OhBhamaAyyoRama – a heartwarming tale of love, loss & rediscovery
— ETV Win (@etvwin) August 1, 2025
Now Streaming! 🎬
On @etvwin @ActorSuhas #MalavikaManoj @anitahasnandani @NenuMeeRamm @radhanmusic @HarishNallaOffl @maniDop pic.twitter.com/chQTgN0zST
కథేంటంటే:
రామ్ (సుహాస్) తల్లి (అనిత ) ఒక నృత్యకారిణి. తన భర్త మోసగించాడని తెలుసుకున్న ఆమె, చిన్నతనంలోనే తన కొడుకు రామ్‌తో కలిసి ఇంటిని వదిలేస్తుంది. కొంతకాలానికి ఆమె కన్నుమూయడంతో, రామ్‌ను అతని మేనమామ అలీ చేరదీసి పెంచుతాడు. ఒక రోజు అనుకోకుండా జరిగిన ఒక చిన్న ప్రమాదం రామ్ జీవితంలోకి సత్యభామ (మాళవిక మనోజ్)ను తీసుకొస్తుంది. తాగిన మత్తులో ఉన్న సత్యభామను జాగ్రత్తగా ఆమె ఇంటి వద్ద దిగబెడతాడు రామ్. అతని నిజాయితీ, మంచితనం నచ్చిన సత్యభామ అతన్ని ప్రేమించడం మొదలుపెడుతుంది.
అయితే, రామ్‌కు సినిమాలంటే అస్సలు ఇష్టం లేని రామ్‌ను సత్యభామ దర్శకుడు హరీశ్ శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేర్చుతుంది. కానీ, మూడేళ్ల వరకు మనం కలువొద్దని కండీషన్ పెట్టి.. అతనికి దూరంగా వెళ్లిపోతుంది. అసలు రామ్ ని డైరెక్టర్ గా సత్యభామ ఎందుకు చూడాలనుకుంది? ఉన్నట్టుండి మూడేళ్లు ఎందుకు దూరంగా వెళ్ళింది? సత్యభామ వచ్చాక రామ్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనేది మూవీ కథాంశం.