
తూప్రాన్, వెలుగు: ఫ్రెండ్మరణాన్ని తట్టుకోలేకపోయిన మెదక్ జిల్లాకు చెందిన యువకుడు పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. తూప్రాన్ మున్సిపల్‌పరిధిలోని రావెల్లికి చెందిన భారతమ్మ, సత్తయ్య కొడుకు గిరికుమార్(26) కూలీ. రెండేళ్ల క్రితం సింగన్నగూడెంకు చెందిన దీక్షతో అతనికి పెండ్లయ్యింది. 2 నెలల కొడుకు ఉన్నాడు. తాగుడికి బానిసైన గిరి కూలీ డబ్బులు ఇంట్లో ఇవ్వకుండా కొన్నిరోజులుగా ఇబ్బందులు పెడుతున్నాడు. ఇదిలా ఉండగా వారం కింద గిరి ప్రాణ స్నేహితుడైన మల్లేశం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి గిరి మనస్తాపం చెందాడు. శుక్రవారం సాయంత్రం మల్లేశంతో దిగిన ఫొటోను వాట్సాప్ స్టేటస్ పెట్టుకుని కింద ‘నిన్ను వదిలి ఉండలేక పోతున్నారా.. అందుకే నీ దగ్గరకి వస్తున్నా’ అని రాశాడు. ఆ తర్వాత పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే తూప్రాన్ గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. సీరియస్‌గా ఉండడంతో అక్కడి నుంచి హైదరాబాద్ఉస్మానియాకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తూప్రాన్ ఎస్సై సురేశ్‌కుమార్ తెలిపారు.