బాలీవుడ్ హీరోయిన్ జుహీ చావ్లాకు రూ.20 లక్షలు ఫైన్ 

V6 Velugu Posted on Jun 04, 2021

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొత్త ఏర్పాటు చేస్తున్న 5జీ నెట్‌వర్క్‌‌ను తొలగించాలని బాలీవుడ్ సీనియర్ హీరోయిన్, పర్యావరణవేత్త జుహీ చావ్లా వేసిన పిటిషన్‌‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. చట్టం పనితీరును జుహీ చావ్లా అవమానించారని ఫైర్ అయిన కోర్టు.. ఆమెతోపాటు మరో ముగ్గురిపై రూ.20 లక్షల జరిమానా విధించింది. పబ్లిసిటీ కోసమే జుహీ పిటిషన్ వేశారని ఫైర్ అయ్యింది. ఈ కేసు వాదనల తాలూకు లింకును జుహీ సోషల్ మీడియాలో పెట్టారని.. దీని వల్ల వాదనకు మూడుమార్లు అంతరాయం కలిగిందని కోర్టు మండిపడింది. ఈ అంతరాయానికి కారణమైన వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. 

Tagged Delhi High Court, 5G Network, Actress Juhi Chawla, Court Imposes Fine, Lawsuit

Latest Videos

Subscribe Now

More News