బీఆర్ఎస్ నేతల విమర్శలను తిప్పికొట్టండి : సుజాత పాల్

బీఆర్ఎస్ నేతల విమర్శలను తిప్పికొట్టండి : సుజాత పాల్
  • ఏఐసీసీ మీడియా కోఆర్డినేటర్సు జాత పాల్ ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ నేతల విమర్శలకు ఎప్పటికప్పుడు కౌంటర్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్నే ఫాలో కావాలని నేతలకు ఆదేశాలిచ్చింది. బీఆర్ఎస్ విమర్శలను సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే తిప్పికొడుతుండగా.. పార్టీ అధికార ప్రతినిధులు ఈ విషయంలో ముందుండాలని సూచించింది. శనివారం గాంధీభవన్​లో పార్టీ అధికార ప్రతినిధులతో ఏఐసీసీ మీడియా తెలంగాణ కో ఆర్డినేటర్ సుజాత పాల్ సమావేశమయ్యారు.

బీఆర్ఎస్ నేతల విమర్శలను ఎలా తిప్పికొట్టాలనే దానిపై చర్చించారు. 17 లోక్‌‌‌‌‌‌‌‌సభ స్థానాలకు 17 మంది అధికార ప్రతినిధులను ఇన్‌‌‌‌‌‌‌‌చార్జులుగా నియమించాలని నిర్ణయించారు. గాంధీభవన్​లోనూ ఇద్దరు అధికార ప్రతినిధులు నిత్యం ప్రెస్​మీట్లు పెట్టేలా బాధ్యతలను అప్పగించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలయ్యాక కొందరు అధికార ప్రతినిధులు సైలెంట్ అయ్యారని, ఇలా అయితే కుదరదని ఆమె అన్నట్టుగా తెలిసింది.

యాక్టివ్​గా పనిచేయాలని ఆదేశించారని సమాచారం. లోక్​సభ ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధమవ్వాలని ఆదేశాలిచ్చినట్టు తెలిసింది. బీఆర్ఎస్, బీజేపీ నేతల విమర్శలకు కౌంటర్లు ఇచ్చేందుకు రెడీ అవ్వాలని సూచించినట్టు సమాచారం.