కాంగ్రెస్‌‌ను ఆర్థికంగా ఇబ్బంది పెట్టేందుకే అకౌంట్స్ ఫ్రీజ్ : సుజాత పాల్

కాంగ్రెస్‌‌ను ఆర్థికంగా ఇబ్బంది పెట్టేందుకే అకౌంట్స్ ఫ్రీజ్ :  సుజాత పాల్

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్‌‌ను ఆర్థికంగా ఇబ్బంది పెట్టేందుకే పార్టీకి సంబంధించిన అకౌంట్స్‌‌ను కేంద్రం ఫ్రీజ్ చేయించిందని పీసీసీ అధికార ప్రతినిధి, తెలంగాణ మీడియా ఇన్ చార్జ్ సుజాత పాల్ తెలిపారు. గురువారం గాంధీ భవన్‌‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. దేశ ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని చెప్పారు. ఈడీ, ఐటీ, సీబీఐ వంటి సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు.

'చందాలు ఇవ్వండి.. దందాలు చేసుకోండి' అన్న విధంగా ఎలక్టోరల్ బాండ్లను బీజేపీ కొనుగోలు చేయించిందని పేర్కొన్నారు. ఐటీ, ఈడీతో పలు గ్రూప్ సంస్థల్లో సోదాలు చేయించి వారి నుంచి బీజేపీ చందాలు వసూలు చేసిందని వెల్లడించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 38 గ్రూప్‌‌లకు 179 ప్రాజెక్టులను కట్టబెట్టిందన్నారు. బీజేపీకి బోగస్ కంపెనీల నుంచి కోట్లాది రూపాయలు చందాల రూపంలో వచ్చినట్టు స్పష్టం చేశారు.