బిష్కెక్: ఇండియా రెజ్లర్లు సుజీత్, అభిమన్యు ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణాలతో మెరిశారు. శనివారం జరిగిన మెన్స్ 65 కేజీల ఫైనల్లో సుజీత్ 8–1తో ఉమిద్జోన్ జాలొలోవ్ (ఉజ్బెకిస్తాన్)పై గెలిచాడు. దాంతో 2019లో బజ్‌రంగ్ పూనియా తర్వాత ఈ కేటగిరీలో గోల్డ్ మెడల్ నెగ్గిన తొలి ఇండియా రెజ్లర్‌గా రికార్డులకెక్కాడు. 70 కేజీల టైటిల్ ఫైట్‌లో అభిమన్యు 5–3తో తుల్గా తుముర్ (మంగోలియా)ను ఓడించాడు.
79 కేజీల ఫైనల్లో సందీప్ మాన్ 1–2తో ప్రత్యర్థి చేతిలో ఓడి సిల్వర్‌తో సరిపెట్టుకున్నాడు. 57 కేజీల బ్రాంజ్ ప్లే ఆఫ్ బౌట్‌లో అంకుష్ 8–2తో ససాకిని ఓడించి పతకం నెగ్గాడు. 61 కేజీల సెమీస్‌లో అమన్ 11–9తో అహ్మద్ (ఇరాన్)పై, 86 కేజీల సెమీస్‌లో ముకుల్ దహియా 12–6తో బోలాట్ (కజకిస్తాన్)పై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించారు. 125 కేజీల్లో దినేశ్ బ్రాంజ్ మెడల్ కోసం పోటీపడనున్నాడు.
