కేటీఆర్ కు సుఖేశ్ చంద్రశేఖర్ లీగల్ నోటీసులు

కేటీఆర్ కు సుఖేశ్ చంద్రశేఖర్ లీగల్ నోటీసులు
  •     క్షమాపణ చెప్పాలని డిమాండ్​

న్యూఢిల్లీ, వెలుగు : మంత్రి కేటీఆర్ కు సుఖేశ్ చంద్రశేఖర్ మంగళవారం లీగల్ నోటీసు పంపారు. తనను కించపరిచే విధంగా ట్విట్టర్ లో కేటీఆర్ చేసిన కామెంట్లకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని అందులో డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏడు పేజీల లీగల్ నోటీసులను కేటీఆర్ కు పంపారు. రోగ్, నోటెడ్ క్రిమినల్, ఫ్రాడ్​స్టర్ అంటూ చేసిన వ్యాఖ్యలు.. తన పేరును కించపరిచేవిగా ఉన్నాయని అందులో పేర్కొన్నారు. తనకు పొలిటికల్ సర్కిల్లో, సినిమా ఇండస్ట్రీలో, బిజినెస్ మెన్ గా మంచి పేరుందన్నారు.

కేటీఆర్ కామెంట్లతో తన మనసు గాయపడడంతోపాటు, కీర్తి దెబ్బతిందని ఆరోపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరిని గౌరవించాల్సి ఉంటుందన్నారు. కేటీఆర్ తనపై చేసిన వ్యాఖ్యలను వారంలోగా ఉపసంహరించుకొని క్షమాణలను చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని సుఖేశ్ హెచ్చరించారు.