జాక్వెలిన్ కోసం సుఖేష్ చంద్రశేఖర్ ఉపవాసం ... తొమ్మిదో రోజు పూజ

జాక్వెలిన్ కోసం సుఖేష్ చంద్రశేఖర్ ఉపవాసం ... తొమ్మిదో రోజు పూజ

మనీలాండరింగ్ కేసులో ఆరెస్ట్ అయి ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్‌  జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ తన ప్రియురాలు, నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు లేఖ రాశారు. ఈ భూమిపై ఉన్న అత్యంత అందమైన మహిళగా ఆమెను  సుఖేష్ అభివర్ణించారు.  

2023  అక్టోబర్ 15 ఆదివారం నుండి ప్రారంభమయ్యే నవరాత్రులలో తొమ్మిది రోజుల పాటు ఉపవాసం ఉండబోతున్నట్లు చెప్పాడు.  తొమ్మిదవ రోజున జైలులో ప్రత్యేక పూజలు చేయనున్నట్లుగా తెలిపాడు.  దుర్గాదేవి ప్రతిదీ చక్కదిద్దబోతోందని. మనము త్వరలోనే మళ్లీ కలుస్తామని.. ఏదీ ఏమి జరిగినా మనము  ఎల్లప్పుడూ కలిసి ఉంటామంటూ  సుఖేష్ తన లేఖలో పేర్కొన్నాడు.  నువ్వే నా లైఫ్ లైన్ అంటూ  జాక్వెలిన్ కు లేఖ రాశాడు సుఖేష్.  

ఓ కేసులో బెయిల్‌ ఇప్పిస్తానంటూ ఫోరిటస్‌ హెల్త్‌కేర్‌ ప్రమోటర్‌ శివిందర్‌ మోహన్‌ సింగ్‌ భార్య ఆదితీ సింగ్‌ నుంచి రూ.200 కోట్లు వసూలు చేశాడు సుఖేష్ . ప్రస్తుతం ఇదే కేసులో ఆయన  తీహార్‌ జైలులో ఉన్నాడు. తన మోసాలకు బాలీవుడ్‌ నటీమణులను పావులుగా వాడుకోవడం సుఖేష్‌కు వెన్నతో పెట్టిన విద్య. హీరోయిన్లు జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్, నోరా ఫతేహీకి ఖరీదైన బహుమతులు, కార్లు ఇచ్చిన లోబర్చుకున్నట్లు సుఖేపై ఆరోపణలున్నాయి.

ALSO READ : IND vs PAK: ఫోర్లు, సిక్సర్ల జోరు.. పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుతున్న రోహిత్ శర్మ