హిమాచల్లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం

 హిమాచల్లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సుఖ్విందర్ సింగ్ సుఖు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా ముఖేశ్ అగ్నిహోత్రి ప్రమాణ స్వీకారం చేశారు. సిమ్లాలోని రిడ్జి మైదానంలో జరిగిన ప్రమాణ స్వీకార  కార్యక్రమానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరులు హాజరయ్యారు.

ఐదుసార్లు పోటీ చేసి నాలుగుసార్లు గెలిచిన సుఖ్విందర్ సింగ్ సుఖు

కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సుఖ్విందర్ సింగ్ సుఖు నడావ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి విజయ్ కుమార్ పై 3వేల ఓట్ల తేడాతో గెలిచారు. ఇప్పటి వరకు మొత్తం ఐదు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సుఖ్విందర్ సింగ్ సుఖు.. నాలుగు సార్లు శాసనసభ్యుడిగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టాడు. 2003 తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన సుఖు.. రెండోసారి 2007 లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు.  అయితే తర్వాత 2012, 2017, 2022 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు గెలిచారు. 2013 నుంచి 2019 వరకు పీసీసీ చీఫ్ హోదాలో ఉన్నారు. 1998 నుంచి 2008 వరకు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు.