మాస్ జాతర మొదలుపెట్టిన పుష్ప.. థియేటర్స్లో బీభత్సమే

మాస్ జాతర మొదలుపెట్టిన పుష్ప.. థియేటర్స్లో బీభత్సమే

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu arjun) హీరోగా క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) కాంబోలో వస్తున్న మూవీ పుష్ప2 ది రూల్(Pushpa2 the rule). పుష్ప సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే కాదు నార్మల్ ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. పార్ట్ 1 భారీ విజయం సాధించిన నేపథ్యంలో పార్ట్ 2 కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేకర్స్. దీంతో పుష్ప 2 గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే 60% షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇదిలా ఉంటే.. పుష్ప 2 తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలైందట. ఈ షెడ్యూల్ లో జాతరకు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కించనున్నారట దర్శకుడు. గతంలో ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన అల్లు అర్జున్ తిరుపతి గంగమ్మ జాతర లుక్ ఎంత ట్రెండ్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో ఇప్పుడు జరుగుతున్న జాతర షూట్ లో అల్లు అర్జున్ అదే లుక్ లో కనిపిస్తారని, ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు అమ్మవారి గెటప్ లో అల్లు అర్జున్ చేసే మాస్ జాతర థియేటర్స్ లో ఆడియన్స్ కు పూనకాలు తెప్పిస్తుందని టాక్.