ఒమన్ సుల్తాన్ ఖబూస్ కన్నుమూత

ఒమన్ సుల్తాన్ ఖబూస్ కన్నుమూత

ఒమన్ సుల్తాన్ ఖబూస్ బిన్ సయిద్ అల్ సయిద్ చనిపోయారు. కొద్ది రోజులుగా క్యాన్సర్ తో బాధపడుతున్న సుల్తాన్ ఖబూస్ శుక్రవారం చనిపోయారు. అరబ్ దేశాలలో ఎక్కువ కాలం పరిపాలించిన సుల్తాన్ గా ఖబూస్ బిన్ సయిద్ గుర్తింపు పొందారు. సుల్తాన్ ఖబూస్ మృతితో ఒమన్ లో మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. సుల్తాన్ ఖబూస్ కు వివాహం కాలేదు. దీంతో రాయల్ ఫ్యామిలీ కౌన్సిల్ లో ఉన్న సుమారు 50 మంది సభ్యులు మూడు రోజుల్లోగా కొత్త సుల్తాన్ ను ఎన్నుకోవాల్సి ఉంటుంది.సుల్తాన్ ఖబూస్ మృతిపై  ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ఒమన్ దేశాన్ని ఆధునీకరించిన గొప్ప దార్శనికుడు ఖబూస్ అని ప్రధాని అన్నారు.