మోంటెకార్లో: ఇండియా స్టార్ ప్లేయర్ సుమిత్ నాగల్.. మెంటెకార్లో మాస్టర్స్ టోర్నీలో ఓటమిపాలయ్యాడు. గురువారం ముగిసిన మెన్స్ సింగిల్స్ రెండో రౌండ్‌లో హోల్గర్ రూనె (డెన్మార్క్) 6–3, 3–6, 6–2తో నాగల్‌పై గెలిచాడు. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో ఇండియన్ ప్లేయర్ ఓడినా ఆకట్టుకున్నాడు. రెండో సెట్‌లో రెండుసార్లు రూనె సర్వీస్‌ను బ్రేక్ చేసిన నాగల్ మ్యాచ్‌లో నిలిచాడు. కానీ నిర్ణయాత్మక మూడో సెట్‌లో నాగల్ స్థాయి మేరకు రాణించలేకపోయాడు. రూనె బలమైన సర్వీస్‌లకు బదులు ఇవ్వలేకపోయాడు.
