కన్ఫ్యూషన్‌లో టీచర్స్.. స్కూళ్లకు ముగిసిన వేసవి సెలవులు

కన్ఫ్యూషన్‌లో టీచర్స్.. స్కూళ్లకు ముగిసిన వేసవి సెలవులు
  • రీ ఓపెనింగ్ పై క్లారిటీ ఇవ్వని ప్రభుత్వం
     

హైదరాబాద్: రాష్ట్రంలోని పాఠశాలలకు వేసవి సెలవులు ఇవాళ్టితో ముగిశాయి. రేపు పునః ప్రారంభిస్తారా.. లేదా ? అయితే ఎలా.. టైమింగ్స్ .. తదితర వివరాలేవీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. విద్యార్థులేమో ఎలాగూ తెరవరు.. తెరచినా వెళ్లేది ఉండదన్న ధీమాతో ఉండగా.. టీచర్లు, సిబ్బంది మాత్రం స్పష్టత లేక ఇబ్బందిపడుతున్నారు. 
కరోనా సెకండ్ వేవ్ కారణంగా లాక్ డౌన్ ప్రకటించి సడలింపులతో పొడిగిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. మరో వైపు స్కూళ్లకు మాత్రం జూన్ 15 వరకు వేసవి సెలవులు పాటించాలని ఆదేశాలిచ్చారు. ఇవాళ్టితో వేసవి సెలవులు ముగిసినట్లే. రేపు బుధవారం స్కూళ్లు తెరుస్తారా.. లేదా అన్నది ప్రభుత్వం ఇంత వరకు ప్రకటించలేదు. మరో వైపు పాఠశాల విద్యాశాఖ సైతం రేపటి నుండి స్కూల్స్ ఉంటాయా ఉండవా అన్నది ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. ప్రభుత్వం నుండి ఆదేశాలు రాలేదు అని పాఠశాల విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. బహిరంగంగా మాట్లాడేందుకు నిరాకరిస్తుండడంతో ఉపాధ్యాయులు అయోమయంలో ఉన్నారు.