సమ్మర్ టూర్ : ఐఆర్‌‌సీటీసీ  ప్యాకేజీలు.. 6 రోజుల  కాశ్మీర్ యాత్ర .. వివరాలు ఇవే..! 

సమ్మర్ టూర్ : ఐఆర్‌‌సీటీసీ  ప్యాకేజీలు.. 6 రోజుల  కాశ్మీర్ యాత్ర .. వివరాలు ఇవే..! 

పంజాగుట్ట, వెలుగు: వేసవి సెలవుల్లో దేశీయ పర్యటనలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఐఆర్‌‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది. ఈ వివరాలను ఐఆర్‌‌సీటీసీ జాయింట్ జనరల్ మేనేజర్ కిషోర్ గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో వెల్లడించారు. 

తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందుబాటులో ఉండేలా హైదరాబాద్ నుంచి కాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, అండమాన్, హరిద్వార్, రిషికేష్ వంటి ప్రాంతాలకు టూర్లను సిద్ధం చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా కాశ్మీర్ 6 రోజుల యాత్రకు (శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గాం, సోన్మార్గ్ సందర్శన) ఒక్కొక్కరికి రూ. 44,600గా ధర నిర్ణయించామన్నారు. పర్యాటకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.