Women Special : సమ్మర్ మేకప్.. ఇంట్లోనే ఇలా సింపుల్గా చేసుకోవచ్చు

Women Special : సమ్మర్ మేకప్.. ఇంట్లోనే ఇలా సింపుల్గా చేసుకోవచ్చు

పెళ్లిళ్ల సందడి మొదలైంది. ఎండలు కూడా విపరీతంగా ఉన్నాయి.. పెళ్లిళ్లకు ఎలా పడితే అలా వెళ్లలేరు. కాస్తయినా మేకప్ టచ్ ఉండాల్సిందే . ఒక పక్క చెమటలు కారుతుంటే.. మరోపక్క మేకప్ వేసుకోవడం ఇబ్బందిగానే ఉంటుంది. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బిందాస్ గా మేకప్ చేసుకోవచ్చు.

మేకప్ వేసుకునే ముందు తప్పనిసరిగా ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. అలంకరణకు ముందు ముఖాన్ని బసు ముక్కతో కాసేపు రుద్దాలి. తరువాత మెత్తని వస్త్రంతో చర్మాన్ని శుభ్రంగా తుడవాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి తేమ అందుతుంది. ఏ చర్మతత్వం వారైనా సరే చర్మం తడి ఆరకముందే మాయిశ్చరై జర్ రాసుకోవాలి.

క్లెన్సర్..

మేకప్ వేసుకోవడానికి ముందు నాణ్యమైన క్లెన్సర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకో వాలి. మేకప్ ఫేస్ వాష్ కు, సబ్బులకు దూరంగా ఉండటం మంచిది.

ఫౌండేషన్

బేసిక్ క్రీం, మాయిశ్చరైజర్ రాసుకున్న తరువాత ఫౌండేషన్ వేసుకోవాలి. వీలైతే కాసేపు మర్దన చేసిన తర్వాత ఫౌండేషన్ రాయాలి. వీలైనంత వరకు లిక్విడ్, మా యిశ్చరైజర్ ఆధారిత ఫౌండేషన్స్ ఎంచు కోవాలి. చాలామంది ఫౌండేషన్ ముఖానికి చక్కగా రాసుకుంటారు. అయితే చెవులు, మెడకు ఏదో మొక్కుబడిగా వేసుకుంటా రు. కానీ ముఖానికి ఎలాగైతే జాగ్రత్తగా వేసుకున్నారో అలానే ఆ భాగాల్లో కూడా ఫౌండేషన్ రాసుకోవాలి. అప్పుడే చూడ్డాని అందంగా కనిపిస్తారు. 

జిడ్డు చర్మం

కొందరి చర్మం బాగా జిడ్డు కారుతుంది. అలాంటి వారు అయిల్ ఫ్రీ ప్రైమరిన్ని రా సుకోవాలి. దీనిలో ఫేస్ ప్రైమర్ ప్రైమర్ అని విడివిడిగా ఉంటాయి. దేనికి దాన్నే వాడుకోవాలి. ఎస్ ఎఫ్ లేని ఫౌండేషన్ని వేసవిలో వాడడం మంచిది. లేదంటే వేసవిలో ఉక్కపోతకు ముఖం అంతా తెల్ల ప్యాచ్లు కనిపిస్తాయి. ఈ కాలంలో మేకప్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిదని  గుర్తుంచుకోవాలి. 

సన్ స్క్రీన్ లోషన్

మేకప్ వేసుకునే ముందు తప్పని సరిగా సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. అంటే కనీసం గంట ముందు సస్క్రీన్ లోషన్ వాడాలన్నమాట. సన్ స్క్రీన్ వాడాలనుకునే వారు దీంతోపాటు ఫౌండేషన్ క్రీం కూడా కలిపి రాసుకుంటే మంచిది. జిడ్డు చర్మం ఉన్నవారు కూడా సస్క్రీస్ లోషన్ రాసుకుంటే మంచిది. వీటిని చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. లిక్విడ్, క్రీం బ్రాంజర్స్ కు దూరంగా ఉండాలి. వేడి వల్ల ఇవి ఇంకా జిడ్డుగా కనిపించేలా చేస్తాయి. వాటికి బదులు మ్యాటీ రకాలను ఎంచుకోవచ్చు.

పెదాలు

ఈ కాలంలో పెదాలకు లిప్ స్టిక్ వేసుకోవాలంటే ముందుగా పెదాలను ప్రబ్ చేసుకోవాలి. తరువాత లిప్ బమ్ రాసుకోవాలి. తర్వాత పెన్సిల్ లిప్లిన్ గీసుకుని లిప్ గ్లాస్ వాడటం మేలు. గులాబీ, కోరల్, పీచ్ రంగులు బాగుంటాయి.

కళ్లకు మ్యాటీ పౌడర్

కళ్లకు ప్రైమర్ వేసాక కాస్త జిడ్డుగా అనిపిస్తుంటే మ్యాటీ పౌడర్ అద్దాలి. ఇలా చేయడం వల్ల మేకప్ తాజాగా కనిపిస్తుంది. వాటర్ ప్రూఫ్ ఐలైనర్, షాడో, మస్కారా, అండర్ ఐ కన్సీలర్ లు వాడటం వల్ల ఐ మేకప్ ఎండకు, చెమటకు కరగకుండా ఉంటుంది.