Summer Special : కుండ నీళ్లు ఎందుకు చల్లగా ఉంటాయ్.. ఎందుకో తెలుసా..!

Summer Special : కుండ నీళ్లు ఎందుకు చల్లగా ఉంటాయ్.. ఎందుకో తెలుసా..!

వేసవి వచ్చిందంటే ఫ్రిజ్లో నీళ్లు తాగాలనుకునేవాళ్లు, ఇప్పుడు కుండనీళ్లపై ఇష్టం చూపుతున్నారు. ఫ్రిజ్ నీళ్ల కంటే కుండ నీళ్లే ఆరోగ్యానికి మంచిది. సైడ్ ఎఫెక్టులు కూడా రావు. అందుకే వేసవి వచ్చిందంటే మట్టి కుండలకు బాగా డిమాండ్. ఒకప్పుడు మట్టి కుండే ప్రతి ఇంట్లో ఉండేది. వేసవి మొదలయ్యే నాటికి సంతల్లో కొత్త కుండలు కనిపించేవి, లేదా కుమ్మరి వాళ్లు కుండల్ని కావడిలో పెట్టుకుని వీధుల్లో తిరుగుతూ అమ్మేవాళ్లు, కుండని ఇంట్లో ఓ మూల కొద్దిగా మట్టిపోసి పెట్టేవాళ్లు.

ఎందుకని అడిగితే కొత్త కుండ కదా.. వెలుస్తుంది (కారుతుంది) అని పెద్దవాళ్లు చెప్పేవాళ్లు. కుండ ఎందుకు కారుతుందో కుండలో నీళ్లు ఎందుకు చల్లగుంటాయంటే.... దీని వెనక సైన్స్ ఉంది. కంటికి కనిపించకుండా కుండకు ఉండే చిన్న రంధ్రాల గుండా లోపలి నీళ్లు బయటకు వస్తాయి.

దాంతో కుండ బయట తడిగా మారుతుంది. బయట వేడికి ఆ నీళ్లు ఆవిరవుతాయి. అలా అవిరి కావడానికి కుండ లోపలున్న నీళ్లు గ్రహిస్తూ ఉంటుంది. ఈ ప్రక్రియ నిరంతరం సాగుతూ ఉంటుంది. అందుకే కుండలో నీళ్లు చల్లగా ఉంటాయి. కొత్తకుండ కొద్దిగా కారుతుంది. అయితే, కుండ పాతబడిపోతే రంధ్రాలు మూసుకుపోతాయి. అందువల్ల నీళ్లు చల్లగా అవడం తగ్గుతుంది. అందువల్లే ప్రతి వేసవికి కొత్తకుండ కొంటారు.