
న్యూఢిల్లీ: సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గురువారం 2025 మార్చి 31తో ముగిసిన నాలుగో క్వార్టర్ ఫలితాలను ప్రకటించింది. కంపెనీ కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ ఏడాదిలెక్కన 19 శాతం తగ్గి రూ.2,153.9 కోట్లకు చేరగా, గత ఏడాది ఇదే కాలంలో రూ. 2,658.7 కోట్లను నమోదు చేసింది. కార్యకలాపాల నుంచి వచ్చిన రెవెన్యూ 8.1 శాతం పెరిగి రూ.11,983 కోట్ల నుంచి రూ.12,958.8 కోట్లకు చేరుకుంది.
2024–25 ఆర్థిక సంవత్సరం కోసం షేర్‌కు రూ.5.50 ఫైనల్ డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది. ఈ ఏడాది జులై 7ను డివిడెండ్‌కు రికార్డ్ డేట్‌గా నిర్ణయించారు. యాన్యువల్ జనరల్ మీటింగ్‌లో అనుమతులు వస్తే ఈ ఏడాది ఆగస్టు 8న డివిడెండ్ చెల్లింపులు జరుగుతాయి. సన్‌ఫార్మా షేర్లు గురువారం 0.76 శాతం తగ్గి రూ.1,719 వద్ద సెటిలయ్యాయి.