
నారా రోహిత్ హీరోగా వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మించిన చిత్రం ‘సుందరకాండ’. వినాయక చవితి రోజున విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సందర్భంగా మూవీ టీమ్ శుక్రవారం థ్యాంక్స్ మీట్ నిర్వహించింది. నారా రోహిత్ మాట్లాడుతూ ‘సినిమాకి మంచి రివ్యూలతో పాటు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
ఇంకా చూడని వాళ్ళు ఫ్యామిలీతో ఈ వీకెండ్ వెళ్లి హ్యాపీగా చూడండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే మంచి చిత్రం ఇది. ఈ మూవీ రిజల్ట్ విషయంలో మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం’ అని చెప్పాడు. తన పాత్రకు మంచి రెస్పాన్స్ రావడం హ్యాపీగా ఉందని హీరోయిన్ వృతి వాఘాని చెప్పింది. ఈ సినిమాని యాక్సెప్ట్ చేసిన ఆడియెన్స్‌కి డైరెక్టర్ వెంకటేష్ థ్యాంక్స్ చెప్పాడు. సినిమాకొస్తున్న రెస్పాన్స్ తమకు గొప్ప ఎనర్జీని ఇచ్చిందని నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు.