
మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) నిర్మిస్తోన్న మూవీ సుందరం మాస్టార్(Sundaram Master). కమెడియన్ హర్షా చెముడు( Harsha chemudu) ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ మూవీ పోస్టర్ తో ఆసక్తి కలిగించిన విషయం తెలిసేందే. తాజాగా సుప్రీం హీరో సాయి ధరమ్ టీజర్ రిలీజ్ చేశారు.ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్ కొత్త కామిక్ యాంగిల్ లో ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
ఒక అడవిలో మాస్టర్ గా వెళ్లిన హర్షా..అక్కడ లెసన్స్ తనదైన శైలిలో చెబుతూ..ఆదివాసీలకు ఏబీసీడీలు నేర్పించే సీన్స్ తో టీజర్ స్టార్ట్ కాగా.. మాస్టార్ హర్షా ఇంగ్లీష్ మాట్లాతుండగా..ఆ అడవిలోని వారు మాస్టర్ కంటే ఫ్లూయెంట్ ఇంగ్లిష్ లో మాట్లాడటం చాలా ఇంట్రెస్ట్ కలిగిస్తోంది.ఆ గూడెంలోని వారి వేషధారణ.. వారు మాట్లాడే ఇంగ్లీష్..హర్షా ఇచ్చే కామిక్ ఎక్స్ప్రెషన్స్ నవ్వులు పంచుతున్నాయి.
ఇక ఈ మూవీ టైటిల్ కింద టాగ్ లైన్ 1930ని కొట్టేస్తూ.. 2023లో ఆదివాసీలు ఎలా ఉంటారనే ఫన్ యాంగిల్‌ను మూవీలో చూపించబోతున్నట్టు టీజర్‌తో అర్థమవుతోంది.బ్యాక్ గ్రౌండ్ లో శ్రీచరణ్ పాకాల సంగీతం ఆకట్టుకుంటోంది.దివ్య శ్రీపాద (Divya Sripada) మరో ప్రధాన పాత్రలో నటిస్తోంది. సుధీర్ కుమార్ కుర్రాతో కలిసి హీరో రవితేజ (RaviTeja) టీమ్ వర్క్స్(Team Works), గోల్డెన్ మీడియా(Golden media) బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.