
వరుస సినిమాలతో బిగ్ స్ర్కీన్‌పై అలరించిన సందీప్ కిషన్.. ఇప్పుడు ఓటీటీపైనా దృష్టి సారించాడు. ఇప్పటికే ‘ఫ్యామిలీ మ్యాన్ 2’లో కీలకపాత్ర పోషించిన సందీప్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ‘సూపర్ సుబ్బు’ టైటిల్‌తో ఇది రూపొందుతోంది. మిథిలా పాల్కర్ హీరోయిన్. మురళీ శర్మ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ‘టిల్లు స్క్వేర్’ ఫేమ్ మల్లిక్ రామ్ రూపొందిస్తున్నాడు. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలకా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది నెట్‌ఫ్లిక్స్‌లో ఇది స్ట్రీమింగ్ కానుందని అనౌన్స్ చేశారు.
ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ ‘ఇప్పుడు మనం ఒక అందమైన కథా కాలంలో ఉన్నాం. కథలు మరింత ధైర్యంగా, భావోద్వేగంగా, మన జీవితాల్లో భాగంగా అనిపించేలా మారాయి. ‘సూపర్ సుబ్బు’ కథ విన్న వెంటనే బాగా నచ్చింది. ప్రేక్షకులు ఈ కథను ప్రేమిస్తారని అనిపించింది. పాత్రల్లో ఎక్సయిట్‌మెంట్, కథలోని కామెడీ సిరీస్ మొత్తాన్ని చిరునవ్వులతో నింపుతాయి’ అని అన్నాడు. సెక్స్ ఎడ్యుకేషన్‌పై అవగాహన పెంచేలా ఈ సిరీస్ ఉంటుందని దర్శకుడు మల్లిక్ రామ్ అన్నాడు. కామెడీ, ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్ అన్ని కలగలసిన కథ ఇదని నటి మిథిలా పాల్కర్ చెప్పింది.