IND vs ENG: మీకు బజ్ బాల్ ఉంటే మాకు విరాట్ బాల్ ఉంది..ఇంగ్లాండ్‌కు గవాస్కర్ కౌంటర్

IND vs ENG: మీకు బజ్ బాల్ ఉంటే మాకు విరాట్ బాల్ ఉంది..ఇంగ్లాండ్‌కు గవాస్కర్ కౌంటర్

బాజ్‌బాల్.. ప్రపంచ క్రికెట్ కు ఇంగ్లాండ్ పరిచయం చేసిన పేరు. ఫార్మాట్ ఏదైనా దూకుడుగా ఆడటం వీరికి అలవాటే. పరిమిత ఓవర్ల క్రికెట్ ను పక్కన పెడితే టెస్టు క్రికెట్ లో వేగంగా ఆడటం వీరికే చెల్లింది. ఓపెనర్ల దగ్గర నుంచి 11వ నెంబర్ బ్యాటర్ వరకు ధనాధన్ బ్యాటింగ్ చేస్తారు. టెస్టు క్రికెట్ ను వన్డేలా మార్చేసి ప్రత్యర్థుల బౌలర్లను దడదడలాడించారు. గెలుపు ఓటములను పట్టించుకోకుండా దూకుడే మంత్రంగా తమ బ్యాటింగ్ ను కొనసాగిస్తున్నారు. బజ్ బాల్ క్రికెట్ ఆడుతున్న ఇంగ్లాండ్ కు తొలిసారి భారత్ లాంటి జట్టు సవాలుగా మారుతుంది. 

ఇటీవలే ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్కలం, బెన్ స్టోక్స్ బజ్ బాల్ కొనసాగిస్తామని చెప్పుకొచ్చారు. అయితే భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మాత్రం ఇంగ్లాండ్ జట్టుకు కౌంటర్ విసిరాడు. మీకు బజ్ బాల్ ఉంటే మాకు విరాట్ బాల్ ఉందని సవాలు విసిరాడు. విరాట్ కోహ్లీ ప్రస్తుతం టాప్ ఫామ్ లో ఉన్నాడు. త‌న‌దైన దూకుడుతో బాజ్‌బాల్ ఆట‌కు చెక్ పెడ‌తాడ‌ని గ‌వాస్క‌ర్ అన్నాడు. ఇంగ్లండ్ జ‌ట్టు బాజ్‌బాల్ ఆట‌ను ఉంటే మాకు అంతకు మించిన విరాట్ బాల్ ఉందని..కోహ్లీ దూకుడు ధాటికి ఇంగ్లాండ్ బజ్ బాల్ పని చేయదని ఈ దిగ్గజ బ్యాటర్ తన అభిప్రాయాన్ని తెలిపాడు.    

ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్టు హైదరాబాద్ లో జరగనుంది. విశాఖపట్నం, రాజ్‌కోట్, రాంచీ, ధర్మశాలలో వరుసగా 2,3,4,5 టెస్టులు ఆడాల్సి ఉంది. ఇప్పటికే బజ్ బాల్ ను కొనసాగిస్తామని చెప్పిన ఇంగ్లీష్ జట్టు భారత్ ను బయపెడుతుందో లేకపోతో వారు తీసుకున్న గోతిలో వారే పెడతారేమో చూడాలి.   

ఇండియా vs ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్

మొదటి టెస్ట్ (జనవరి 25 - జనవరి 29): హైదరాబాద్
రెండో టెస్ట్ (ఫిబ్రవరి 02 - ఫిబ్రవరి 06): విశాఖపట్నం
మూడో టెస్ట్ (ఫిబ్రవరి 15 - ఫిబ్రవరి 19) : రాజ్‌కోట్
నాలుగో టెస్ట్ (ఫిబ్రవరి 23 - ఫిబ్రవరి 27): రాంచీ
ఐదో టెస్ట్(మార్చి 7 - మార్చి 11): ధర్మశాల