
ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్ ఓటముల పరంపర కొనసాగుతోంది. మే 6వ తేదీన శనివారం చెన్నై సూపర్ కింగ్స్ చేతిలోనూ ఓడిపోయింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. చెన్నైతో జరిగిన మ్యాచ్లోనూ అతను డకౌట్ అయ్యాడు. దీంతో రోహిత్ శర్మపై మాజీ క్రికెటర్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో రోహిత్ శర్మపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఆటగాడిగా..కెప్టెన్గా విఫలం..
చెన్నై చేతిలో ముంబై ఇండియన్స్ ఓటమి పాలవడంపై కెప్టెన్ రోహిత్ శర్మ ఇంటా బయట విమర్శలెదుర్కొంటున్నాడు. బ్యాట్స్ మన్ గా రోహిత్ శర్మ మరోసారి డకౌట్ కావడంపై మండిపడుతున్నారు. ఆటగాడిగా విఫలమైనా..కెప్టెన్గా అయినా జట్టును గెలిపించడంలో విఫలమయ్యాడని ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఫామ్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
విశ్రాంతి తీస్కో..
ఆటగాడిగా విఫలమవుతున్న ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోవాలని సునీల్ గవాస్కర్ సూచించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో రోహిత్ డకౌట్ అయిన తీరు ఆందోళనకరమన్నాడు. త్వరలో WTC ఫైనల్ ఉందని...దాన్ని దృష్టిలో పెట్టుకుని రోహిత్ శర్మ ఫాంలోకి రావాల్సి ఉందన్నాడు. ఫాంతో పాటు...ఫిట్ గా ఉండాలని సూచించాడు. ఇందుకోసం ఐపీఎల్‌లో కొన్ని మ్యాచ్‌ల నుంచి బ్రేక్ తీసుకోవాలన్నాడు. ఐపీఎల్ వైఫల్య ప్రభావం WTC ఫైనల్‌పై పడకూడదని కోరుకుంటున్నట్లు గవాస్కర్ తెలిపాడు.