IPL 2024: మీ దేశానికో దండం: రిటైర్మెంట్ నుంచి వెనక్కి రాలేను: సునీల్ నరైన్

IPL 2024: మీ దేశానికో దండం: రిటైర్మెంట్ నుంచి వెనక్కి రాలేను: సునీల్ నరైన్

కోల్ కతా నైట్ రైడర్స్ స్టార్ ఆల్ రౌండర్ సునీల్ నరైన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ మిస్టరీ స్పిన్నర్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన  ఇస్తున్నాడు. ఓపెనర్ గా వస్తూ మెరుపు ఆరంభాలను ఇవ్వడమే కాదు.. బంతితోనూ మ్యాజిక్ చేస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా సెంచరీ చేసిన ఈ విండీస్ వీరుడు.. మొత్తం 7 మ్యాచ్ ల్లో 286 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్టులో 7 వ స్థానంలో నిలిచాడు. బౌలింగ్ లోనూ రాణించి 9 వికెట్లు పడగొట్టాడు. 

నరైన్ సూపర్ ఫామ్ తో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు, కెప్టెన్ రోవ్ మన్ పావెల్ అతన్ని టీ20 వరల్డ్ కప్ ఆడించే ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ ముగిసిన వారం రోజుల తర్వాత జూన్ 1 నుంచి పొట్టి సమరం జరగనుంది. స్వదేశంలో జరగబోయే ఈ మెగా టోర్నీకి నరైన్ ఉంటే జట్టు బలంగా మారడం ఖాయం. అయితే నరైన్ విండీస్ బోర్డుకు, క్రికెట్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చాడు. రిటైర్మెంట్ నుంచి వెనక్కి వచ్చే ప్రసక్తే లేదని తేల్చేశాడు. 

వెస్టిండీస్ క్రికెట్ తరపున ఆడేందుకు నేను సిద్ధంగా లేను. చాల మంది నన్ను రిటైర్మెంట్ నుంచి వెనక్కి రావాలని కోరుతున్నారు. నాపై ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. కుర్రాళ్ళు కొన్ని నెలలుగా కష్టపడి ఆడుతున్నారు. వారికి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. స్వదేశంలో జరగబోయే మా జట్టును నేను సపోర్ట్ చేస్తాను. మరో టీ20 వరల్డ్ కప్ టైటిల్ గెలుచుకుంటుందని ఆశిస్తున్నాను. అని నరైన్ ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో రాశారు. 2019 లో చివరిసారిగా వెస్టిండీస్ తరపున ఆడిన నరైన్.. 2023 నవంబర్ లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.