అయోధ్య తీర్పుపై సున్నీ వక్ఫ్ బోర్డు లాయర్ జఫర్యాబ్ జిలానీ మాట్లాడారు. సుప్రీం తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని అనుకున్నామని ఆయన అన్నారు. సుప్రీం తీర్పును తాము గౌరవిస్తున్నామని చెప్పారు. దేశం మొత్తం శాంతియుతంగా ఉండాలని కోరారు. తీర్పుపై ముస్లిం లాబోర్టు అసంతృప్తిగా ఉందని అన్నారు. రివ్యూ పిటిషన్ పై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
అయోధ్య వివాదాస్పద స్థలాన్ని హిందువులకు చెందినదిగా తీర్పునిచ్చింది సుప్రీం కోర్టు. ముస్లింలకు ఐదెకరాల భూమిని కెటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఐదుగురు న్యాయమూర్తుల దర్మాసనం ఏకగ్రావంగా తీర్పును ఇచ్చింది. ఇలా జరగటం మొదటిసారి.
